The Elephant Whisperers: ఇంత మోసమా..?

Hyderabad: కోలీవుడ్ నుంచి ది ఎలిఫాంట్ విస్ప‌ర‌ర్స్ (the elephant whisperers) అనే డాక్యుమెంట‌రీకి ఆస్కార్ (oscar) అవార్డు ల‌భించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ డాక్యుమెంట‌రీ తీసిన డైరెక్ట‌ర్ కార్తికి గోన్‌సాల్వేస్ (kartiki gonsalves) చేసిన మోసం బ‌య‌టప‌డింది. ఈ డాక్యుమెంట‌రీలో న‌టించిన బొమ్మ‌న్ (bomman), బెల్లీ (bellie) దంప‌తుల ప‌ట్ల నీచంగా ప్ర‌వ‌ర్తించింద‌ట‌. త‌మిళ‌నాడుకు చెందిన బొమ్మ‌న్, బెల్లీలు ఏనుగుల‌ను సంర‌క్షిస్తుంటారు. సో వారినే పెట్టి డాక్యుమెంట‌రీ తీస్తే నేచుర‌ల్‌గా ఉంటుంద‌ని కార్తికి అనుకుంది. ఇందుకు బొమ్మ‌న్, బెల్లీ కూడా ఒప్పుకున్నారు.

అయితే డాక్యుమెంట‌రీ తీస్తున్న స‌మ‌యంలో ఓ సీన్ తీయ‌డానికి ల‌క్ష వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంద‌ని కానీ త‌న ద‌గ్గ‌న అంత డ‌బ్బు లేద‌ని కార్తికి చెప్పింద‌ట‌. దాంతో పాపం బొమ్మ‌న్, బెల్లీ తాము దాచుకున్న ల‌క్ష తీసి కార్తికికి ఇచ్చారు. షూటింగ్ అయ్యాక డ‌బ్బు ఇచ్చేస్తాన‌ని చెప్పిన కార్తికి అస‌లు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయ‌డంలేద‌ట‌. డాక్యుమెంట‌రీకి ఆస్కార్ వ‌చ్చిన‌ప్పుడు త‌మ‌ను క‌నీసం ఆ అవార్డును ప‌ట్టుకోనివ్వ‌లేద‌ని బొమ్మ‌న్ దంప‌తులు షాకింగ్ ఆరోప‌ణ‌లు చేసారు. కార్తికి త‌మ‌కు రూ.2 కోట్ల వ‌ర‌కు డ‌బ్బు ఇవ్వాల్సి ఉంద‌ని అంటున్నారు.

డాక్యుమెంటరీ తీయాల‌ని కార్తికి నిర్ణ‌యించుకున్న‌ప్పుడు బొమ్మ‌న్, బెల్లీలతో ఒక ఒప్పందం కుదుర్చుకుంద‌ట‌. డాక్యుమెంట‌రీ బాగా వ‌స్తే కొంత డ‌బ్బు, ఒక మంచి ఇల్లు ఇప్పిస్తాన‌ని కార్తికి వారితో చెప్పింద‌ట‌. కానీ ఇప్పుడు ఏకంగా ఆస్కార్ వ‌చ్చినా త‌మను క‌నీసం ప‌ట్టించుకోవ‌డంలేద‌ని బొమ్మ‌న్ దంప‌తులు వాపోయారు. దాంతో వారు ఓ అడ్వొకేట్ సాయంతో కార్తికిపై పిటిష‌న్ దాఖ‌లు చేసారు. (the elephant whisperers)