Orange: జపాన్‌లో చెర్రీ సినిమా రిలీజ్​!

Hyderabad: ఆర్ఆర్ఆర్(RRR)  సక్సెస్​తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan Tej) గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఈ సినిమా ఆస్కార్(Oscar)​ అందుకోవడంతో చరణ్‌కు ప్రపంచవ్యాప్తంగా సాలిడ్ క్రేజ్ వచ్చింది. బాలీవుడ్(Bollywood)​, హాలీవుడ్​ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. కాగా, ప్రస్తుతం చెర్రీ కోలీవుడ్​ స్టార్​ డైరెక్టర్​ శంకర్​ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గేమ్​ ఛేంజర్​ షూటింగ్​తో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం టాలీవుడ్​లో నడుస్తున్న రీ రిలీజ్​ ట్రెండ్​కి తగినట్టు రామ్​ చరణ్​ నటించిన ఆరెంజ్(Orange)​ సినిమాను ఇటీవలే రీ రిలీజ్​ చేశారు మేకర్స్​. అప్పుడు డిజాస్టర్​గా మిగిలిన ఈ సినిమా ఇప్పుడు మాత్రం అనూహ్యమైన కలెక్షన్లు రాబట్టింది. దీంతో ఈ సినిమాను జపాన్​లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు హ్యారిస్ జైరాజ్ సంగీతం చాలా ప్లస్​ అయ్యింది. ఈ సినిమాలో అందాల భామ జెనీలియా(Genelia D’Souza) హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలోని పాటలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలవడంతో, ఈ సినిమాను మళ్లీ చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపుతున్నారు.

కాగా, ఈ సినిమాను జపాన్‌లో మే 6న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ఈ సినిమాకు జపాన్ ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్‌ను అందిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆర్​ఆర్​ఆర్​ ఆస్కార్​ ప్రమోషన్స్​లో భాగంగా జపాన్​ వెళ్లిన చెర్రీకి సాదర స్వాగతం లభించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమానూ జపనీయులు ఆదరిస్తారో చూడాలి మరి!