Rashmika Mandanna: హాట్ రొమాన్స్.. నేనెప్పుడన్నాను?
Rashmika Mandanna: రోజురోజుకీ నేషనల్ క్రష్ రష్మిక మందనపై లేనిపోని చెత్త రూమర్స్ ఎక్కువ అవుతూనే ఉన్నాయి. గతంలో నటీనటులు ఏం చెప్పేవారో అదే ప్రేక్షకులకు తెలియజేసేవారు. కానీ ఇప్పుడు టైపింగ్ నేర్చుకున్న ప్రతీ ఒక్కరు జర్నలిస్ట్‌లే అంటూ ఇష్టారాజ్యంగా ఏది పడితే అది రాసేస్తున్నారు. అసలు సెలబ్రిటీలు అనని మాటలను కూడా అన్నారని రాస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని నటీనటులు కూడా ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నారు.
ఇంతకీ ఇప్పుడు రష్మిక విషయంలో ఏం జరిగిందంటే.. పుష్ప, యానిమల్ తర్వాత తన చేతిలో యాక్షన్ ఆధారిత సినిమాలే ఉన్నాయని.. తనకు హాట్ రొమాంటిక్ సినిమాల్లో నటించాలని ఉందని ఓ సందర్భంలో అన్నారట. ఈ విషయాన్ని ఓ వెబ్‌సైట్ వారు పబ్లిష్ చేయడంతో వెంటనే రష్మిక దీనిపై స్పందించారు. తాను ఎప్పుడూ ఎక్కడా ఇలాంటి కామెంట్ చేయలేదని స్పష్టం చేసారు.
ALSO READ: Rashmika Mandanna: ఇలాంటి చెత్త రూమర్స్ ఎక్కడి నుంచి వస్తాయ్?
ఇదే కాదు.. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను కేవలం శర్వానంద్ కోసమే ఒప్పుకున్నానని రష్మిక అన్నట్లు మరో వెబ్‌సైట్ వారు రాసేసారు. దీనిపై కూడా రష్మిక స్పందించాల్సి వచ్చింది. తనకు దర్శకుడు, హీరో కంటే కథ ముఖ్యమని అది బాగుంటేనే సినిమాకు సంతకం చేస్తానని క్లారిటీ ఇచ్చింది.