Adipurush: సరిగ్గా నెలరోజులు.. స్పెషల్ పోస్టర్!
Mumbai: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆదిపురుష్(Adipurush). రామాయణం(Ramayanam) ఆధారంగా రూపొందుతున్నఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా, కృతి సనన్(Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా నటిస్తున్నారు. ప్రముఖ బాలీవువడ్ డైరెక్టర్ ఓం రౌత్(Om Raut) ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కోవడంతో గ్రాఫిక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోని డైరెక్టర్ ఓం రౌత్ పలు మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో విడుదలైన ‘జై శ్రీరామ్’ సాంగ్ ఆదిపురుష్ ప్రమోషన్స్ కి మంచి కిక్ ఇచ్చింది.
ఒక్క పోస్టర్, ఒక్క సాంగ్ తో ఆదిపురుష్ సినిమాపై అంచనాలు పెంచాడు ఓం రౌత్. నెగటివ్ కామెంట్స్ నెమ్మదిగా పాజిటివ్ కామెంట్స్ గా మారడం మొదలయ్యాయి. ఇక ఎప్పుడైతే ఆదిపురుష్ ట్రైలర్ బయటకి వచ్చింది, అన్ని లెక్కలు తారుమారు అయ్యాయి. ట్రైలర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ రావడంతో ఆదిపురుష్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.ఇక తాజాగా, ఆదిపురుష్ ట్రైలర్ లోని ఐకానిక్ షాట్ అయిన రాముడు హనుమంతుడిపై నిలబడి బాణాలు వేసే సీన్ ని పోస్టర్ గా రిలీజ్ చేశారు. ఆదిపురుష్ రిలీజ్ నెల రోజులు మాత్రమే ఉండడంతో ఈ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. డైరెక్టర్ ఓం రౌత్ స్వయంగా ఈ పోస్టర్ని సోషల్ మీడియాలో షేర్ చేసి ‘సరిగ్గా నెలరోజులు’ అని వ్యాఖ్య జోడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్గా మారింది.