Movie: సినిమా ఇండస్ట్రీనే అప్పుల్లో ముంచేసిన ఏకైక చిత్రం
Movie: బాహుబలి, పద్మావత్, బాజీరావ్ మస్తానీ.. ఇలాంటి సినిమాలు తీయాలంటే భారీ బడ్జెట్ కావాలి. అంత బడ్జెట్ పెట్టి తీసినా ఆడకపోతే మాత్రం నష్టం మామూలుగా ఉండదు. అందుకే ఇలాంటి పీరియాడిక్ సినిమాలు తీయడానికి దర్శకులు, నిర్మాతలు ఎంతో ఆలోచిస్తుంటారు.
అయితే 1970ల్లో ఇలాగే ఓ దర్శకుడు పీరియాడిక్ సినిమా తీయాలనుకున్నాడు. అది కూడా ఢిల్లీ సుల్తానా అయితే రజియా బేగమ్ బయోపిక్. 1975లో సినిమాను ప్లాన్ చేస్తే 1983 వరకు ఎవర్ని పెట్టి తీయాలా అనే చర్చ జరుగుతూనే ఉంది. అలా 1983లో ధర్మేంద్ర, హేమా మాలినిని ఫిక్స్ చేసి సినిమాను పూర్తి చేసారు. అప్పట్లో ఈ సినిమాను రూ.10 కోట్లు పెట్టి తీసారు. అప్పట్లో పది కోట్లు అంటే ఇప్పుడు రూ.200 కోట్లతో సమానం.
కానీ ఏం లాభం.. సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. కేవలం రూ.1 కోటి వరకే వసూళ్లు రాబట్టింది. సినిమాలో చాలా మటుకు డైలాగులు ఉర్దూలో ఉంటాయి. అప్పట్లో ఆడియన్స్‌కి ఉర్దూ అర్థమయ్యేది కాదు. సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో దర్శకుడు, నిర్మాతలు, ఇన్‌వెస్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. దీనిపై దర్శకుడు కమల్ ఆమ్రోహి స్పందిస్తూ తాను తప్ప ఎవ్వరికీ నష్టం జరగలేదని కొన్ని ఏళ్ల పాటు సినిమా షూటింగ్ నడిచింది కాబట్టి వందలాది మందికి ఉపాధి లభించిందని ఆయన వెల్లడించారు.