ప్రభాస్​తో అదిరిపోయే ఫొటో షేర్​ చేసిన ఓం రౌత్​!

Mumbai: యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్(Prabhas) హీరోగా బాలీవుడ్​ దర్శకుడు ఓం రౌత్(Om Raut)​ రూపొందించిన సినిమా ఆదిపురుష్(Adipurush). రామాయణం(Ramayanam) ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్​ రాముడిగా, కృతిసనన్(Krithi sanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా నటిస్తున్నారు. పాన్​ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా జూన్​ 16న విడుదల కానుంది. కొన్నాళ్ల కింద రిలీజైన టీజర్​పై భారీగా విమర్శలు రావడంతో విడుదలను వాయిదా వేసి గ్రాఫిక్స్​పై ఫోకస్​ చేసింది చిత్రబృందం. తాజాగా రిలీజైన ట్రైలర్​ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

రిలీజ్​కి​ ఇంకా రెండు నెలలు ఉండగానే ఆదిపురుష్​ టీమ్​ ప్రమోషన్స్​ షురూ చేసింది. ఇందులో భాగంగానే వరుస పోస్టర్లు, అప్​డేట్లతో సర్​ప్రైజ్​ చేస్తున్నారు. తాజాగా డైరెక్టర్ ఓంరౌత్ ప్రభాస్​తో దిగిన ఓ బ్యూటీఫుల్ పిక్ షేర్​ చేశారు. ఆదిపురుష్​ హీరో ప్రభాస్ తో కలిసి ట్రైలర్ చూస్తున్న ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేశారు. ఇద్దరూ కూడా 3డి గ్లాసెస్ పెట్టుకుని ట్రైలర్ చూస్తూ కనిపించారు. అంతేకాదు ‘యే దోస్తీ.. 3డిలలో ఆదిపురుష్ ట్రైలర్ నా స్నేహితుడితో కలిసి చూస్తున్నాను’ అంటూ క్యాప్షన్​ కూడా జతచేశారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరలవుతుండగా.. ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.