Adipurush: ప్రభాస్‌ని బలవంతంగా ఒప్పించారా?
Hyderabad: ఎన్నో వివాదాలను ఎదుర్కొంటున్న ఆదిపురుష్ (adipurush) సినిమా చేయడానికి ముందు ప్రభాస్ (prabhas) ఒప్పుకోలేదట. సాహో (saaho), రాధేశ్యాం (radhe syha)సినిమాలు ఫ్లాప్ అవడంతో ఫ్యాన్స్ కోసం బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్న ప్రభాస్‌కు.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ (om raut) ఆదిపురుష్ స్క్రిప్ట్ గురించి చెప్పాడు. అది రామాయణం కావడంతో సరిగ్గా తీయకపోతే ఫ్యాన్స్, ఆడియన్స్ హర్ట్ అవుతారని చేయనని చెప్పేసాడట ప్రభాస్. కానీ ఓం రౌత్ పట్టువిడవకుండా ప్రభాస్ వెంటే తిరుగుతూ చెప్పిన స్క్రిప్ట్‌నే పది సార్లు చెప్పి బలవంతంగా ఒప్పించాడని బాలీవుడ్ వర్గాల సమాచారం.
మొత్తానికి ప్రభాస్ (prabhas) ఒప్పుకుని కాల్షీట్స్ ఇస్తే.. ఓం రౌత్ (om raut) చీప్ VFX వాడి జనాలపైకి వదిలాడు. సినిమా బాగుంటే రామాయణం (ramayanam) లాంటి గొప్ప పురాణాన్ని ప్రభాస్ ద్వారా ప్రజలకు చెప్పించాలని అనుకున్నట్లు ఓం రౌత్ సొంత డప్పు కొట్టుకునేవాడు. సినిమా కలెక్షన్లు బాగానే ఉన్నప్పటికీ.. చాలా మంది సెలబ్రిటీలు పురాణాన్ని అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఓం రౌత్, సినిమాకు డైలాగులు రాసిన మనోజ్ ముంతాషిర్లు (manoj muntashir) ఇది అసలు రామాయణం కాదని, హనుమంతుడు దేవుడే కాడని నోటికొచ్చినట్లు వాగుతున్నారు. ఏదేమైనా ప్రభాస్ (prabhas) ఇంకెప్పుడూ ఇలాంటి డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వకుండా తెలుగు లేదా తమిళ డైరెక్టర్లతో కలిసి వర్క్ చేస్తే బ్లాక్ బస్టర్స్ రావడం గ్యారెంటీ అనే చెప్పాలి.