“మా అన్నను బాధపెట్టి ఐశ్వర్య ఏడుస్తోంది”
Sohail khan: అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ విడిపోతున్నారు అన్న ప్రచారం జోరందుకున్నప్పటి నుంచి సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్‌లపై గతంలో చాలా మంది చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ ఐశ్వర్య రాయ్‌పై ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు సల్మాన్, ఐశ్వర్యా రాయ్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కానీ సల్మాన్‌కి మద్యం అలవాటు ఉండడం.. ఆ అలవాటు వల్ల ఐశ్వర్య రాయ్‌ని కొట్టడం, తిట్టడం లాంటివి చేసేవాడట. దాంతో ఐష్ సల్మాన్‌కి బ్రేకప్ చెప్పిందని ఇప్పటికీ ఉన్న ప్రచారమే.
దీనిపై సల్మాన్ సోదరుడు సొహైల్ అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేసాడు. “” మా అన్న ఐశ్వర్యా రాయ్‌ని ఎంతో ప్రేమించాడు. తనతో కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకున్నాడు. మా కుటుంబం అంతా ఐశ్వర్యను సొంతింటి అమ్మాయిలా చూసుకునేది. వారంలో నాలుగు సార్లు మా ఇంటికి వచ్చి పోతుండేది. అప్పుడు మీడియా వారంతా చూసేవారు. మరి మీడియాకు మా అన్న ఏమని సమాధానం చెప్తాడు? ప్రేమ విషయం చెప్పేద్దాం అని సల్మాన్ ఎన్నిసార్లు ఐశ్వర్యతో చెప్పినా ఆమె వినలేదు. వద్దు వద్దు అని వారించేది. మా అన్నని నాశనం చేసి ఇప్పుడు మీడియా ముందుకు వెళ్లి సల్మాన్ నన్ను కొట్టేవాడు తిట్టేవాడు అంటే ఎలా కుదురుద్ది? “” అని మండిపడ్డాడు.
ఐష్, అభిషేక్ విడాకులు
కొంతకాలంగా ఐష్, అభిషేక్ విడిపోవాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇద్దరూ స్పందించడం లేదు. వీరిద్దరూ విడిపోవడానికి రెండు కారణాలు ప్రచారంలో ఉన్నాయి. ఒకటి.. అమితాబ్ బచ్చన్ తనకున్న ఇళ్లల్లో ఒక ఖరీదైన ఇంటిని కూతురు శ్వేతా బచ్చన్‌కి రాసివ్వడం. రెండోది.. బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్‌తో అభిషేక్‌కి ఎఫైర్ ఉందని.. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఐష్‌ని వదిలేయాలని చూస్తున్నారని అంటున్నారు.