OG: ఆరేళ్ల త‌ర్వాత‌.. చాలు సామీ చాలు..!

Hyderabad: ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) న‌టిస్తున్న OG సినిమా ఫ‌స్ట్‌లుక్ డేట్ ఫిక్స్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా ఓజీ (og)లుక్‌ను ఆగ‌స్ట్ 15న‌ రిలీజ్ చేయాల‌ని టీం అనుకుంటోంద‌ట‌. సుజీత్ (sujeeth) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన BTS పిక్స్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దాదాపు ఆరేళ్ల త‌ర్వాత ప‌వ‌న్ రీమేక్ సినిమాతో కాకుండా ఒరిజినల్ కంటెంట్ ఉన్న సినిమాతో ఆడియ‌న్స్ ముందుకు రాబోతున్నారు.

దాంతో ఓజీపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ కాకుండానే మోస్ట్ ట్వీటెడ్ సౌత్ ఇండియ‌న్ సినిమాల్లో టాప్ 3వ స్థానంలో og ఉంద‌ట‌. ఆల్రెడీ ఓవ‌ర్‌సీస్ రైట్స్ భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయిన‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఇక ఇందులో ప్రియాంక అరుళ్ మోహ‌న్ (priyanka arul mohan) హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఆమెకు సంబంధించిన ఎలాంటి లుక్స్ ఇప్ప‌టివ‌ర‌కు బ‌య‌టికి రాలేదు. మ‌రి ఆగ‌స్ట్ 15న ఫ‌స్ట్‌లుక్ ఏ రేంజ్‌లో ఉండ‌బోతోందో..!

og pawan kalyan
og pawan kalyan