Chatrapathi Remake: సప్నని పరిచయం చేసిన ఛత్రపతి!

Hyderabad: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) బాలీవుడ్ (Bollywood) ఎంట్రీ ఇస్తూ చేస్తున్న సినిమా ఛత్రపతి(Chatrapathi). 2005 లో రాజమౌళి(SS Rajamouli), ప్రభాస్(Prabhas) కలయికలో వచ్చిన ఛత్రపతికి హిందీ రీమేక్​గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అల్లుడు శీను సినిమాతో తనకి టాలీవుడ్​లో గ్రాండ్ డెబ్యూట్ అందించిన వి వి వినాయక్(VV Vinayak) ని తన బాలీవుడ్ డెబ్యూట్ కోసం ఎంచుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్​కి బాలీవుడ్​తోపాటు టాలీవుడ్​లోనూ మంచి రెస్పాన్స్​ వచ్చింది.
ప్రభాస్ పాత్రకి బెల్లంకొండ కరెక్ట్ గా సెట్ అయ్యాడని, వినాయక్ కూడా కమ్‌బ్యాక్ ఇచ్చాడని అభిమానులు సంబరపడిపోతున్నారు. దీంతో చిత్ర యూనిట్ మూవీ విజయం పై నమ్మకంగా ఉంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అన్నది ఇప్పటివరకు రివీల్​ చెయ్యలేదు. నుష్రత్ బరుచా (Nushrratt Bharuccha) శ్రీనివాస్ సరసన నటించబోతుంది అంటూ బాలీవుడ్ వార్తలు వినిపించిన చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కాగా, తాజాగా బెల్లంకొండ తన హీరోయిన్ పరిచయం చేశాడు.

బాలీవుడ్ వార్తల్లో వినిపించిన నుష్రత్ బరుచానే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ‘మీట్ ఛత్రపతి సప్న’ అంటూ నుష్రత్ తో ఉన్న ఫోటోని రిలీజ్ చేశాడు శ్రీనివాస్​. తనిష్క్ బాఘ్చి (Tanishk Bagchi) ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మే 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమాతో శ్రీనివాస్​ బాలీవుడ్ లో కూడా మంచి డెబ్యూట్ హిట్టు అందుకుంటాడా, లేదా.. అనేది చూడాలి మరి!