NTR31: బర్త్​డే స్పెషల్​ అనౌన్స్‌మెంట్!

Hyderabad: యంగ్​ టైగర్​ ఎన్టీఆర్(Jr NTR)​ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్​ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఎన్టీఆర్​30(NTR30) నుంచి ఫస్ట్​లుక్​తో పాటు టైటిల్​ రివీల్​​ చేసి ఓ రోజు ముందుగానే అదిరిపోయే ట్రీట్​ ఇచ్చారు డైరెక్టర్​ కొరటాల శివ(Koratala Siva). ‘దేవర’(Devara) టైటిల్​తో ఎన్టీఆర్​ మాస్ లుక్​ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఇక, ఎన్టీఆర్​ తదుపరి సినిమా నుంచి కూడా ఓ అప్​డేట్​ ఇచ్చి ఫ్యాన్స్​ని ఖుషీ చేశారు సెన్సేషనల్​ డైరెక్టర్​ ప్రశాంత్​ నీల్(Prashanth Neel)​. ఎన్టీఆర్​31(NTR31)గా ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా షూటింగ్​ ఎప్పుడు స్టార్టవనుందో క్లారిటీ ఇస్తూ తారక్​ బర్త్​డే స్పెషల్ పోస్టర్​ రిలీజ్​ చేశారు.

ఆర్ఆర్​ఆర్​ తర్వాత దాదాపు సంవత్సరం గ్యాప్​ తీసుకున్న తారక్​ ఇటీవలే దేవర షూటింగ్​ స్టార్ట్​ చేశారు. కాగా, ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలోనూ ఎన్టీఆర్​ హీరోగా సినిమా రూపొందనుందని ఏడాది కిందటే ప్రకటించారు మేకర్స్​. కానీ ఆ సినిమా ఇంకా సెట్స్​పైకి వెళ్లలేదు. తాజా పోస్టర్​ ప్రకారం ఎన్టీఆర్​ 31 షూటింగ్​ని 2024 మార్చిలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దేవర షూటింగ్​ పూర్తవగానే తారక్​ ఈ షూటింగ్​లో జాయినవుతారు. దేవర సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్​ 5న విడుదల కానున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్​, కేజీఎఫ్​2తో సెన్సేషన్​ క్రియేట్​ చేసిన ప్రశాంత్​ నీల్​ ఎన్టీఆర్​తో రూపొందించేందుకు కథ సిద్ధం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ప్రభాస్​ హీరోగా తెరకెక్కుతున్న సలార్​ షూటింగ్​ శరవేగంగా జరుగుతోంది. ఇటు సలార్​, అటు దేవర పూర్తయిన వెంటనే ఈ ఇద్దరి కాంబినేషన్లో రానున్న సినిమా పట్టాలెక్కనుంది.