NTR30: ఇంకొన్ని గంట‌ల్లో పూన‌కాలే..!

Hyderabad: యంగ్​ టైగర్​ ఎన్టీఆర్ (Jr NTR)- కొరటాల శివ (Siva Koratala) కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ఎన్టీఆర్‌ 30 (NTR 30). ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి మేకర్స్​ ఎప్పుడు ఏ అప్​డేట్​ ఇస్తారా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. కాగా, షూటింగ్​ ఆలస్యంగా మొదలు పెట్టినా ఎప్పటికప్పుడు వరుస అప్​డేట్స్​తో ఫ్యాన్స్​ను ఖుషీ చేస్తున్నారు కొరటాల శివ. ఈ సినిమా మొదలైనప్పటినుంచీ వరుస సర్​ప్రైజ్​లతో భారీ హైప్​ క్రియేట్​ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్​(Bollywood) భామ జాన్వీకపూర్‌(Jahnvi Kapoor) తారక్​కు జోడీగా నటిస్తోంది. ఇక ఈ సినిమాకి దేవర అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్​. కాగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్​లుక్​ విడుదల టైంని ఫిక్స్​ చేశారు మేకర్స్​.

ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ను ఈరోజు(మే 19) సాయంత్రం 7:02 గంటలకు లాంఛ్‌ చేయనున్నట్టు తెలియజేస్తూ.. ‘అతని కంటే భయపెట్టేది.. అతని కథ..’ అంటూ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ అందించింది. ఫిషింగ్‌ హార్బర్‌ విలేజ్‌, పోర్ట్ మాఫియా బ్యాక్‌ డ్రాప్‌ చుట్టూ తిరిగే కథాంశంతో సాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఊర​ మాస్​ రోల్​లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. రేపు (మే 20) తారక్​ పుట్టినరోజు కావడంతో ముందుగానే ఎన్టీఆర్​ ఫస్ట్​లుక్​తో ఫ్యాన్స్​కి బర్త్​డే ట్రీట్​ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు మేకర్స్.

ఎన్టీఆర్ 30 చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్‌ 30ని 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. కొరటాల, తారక్​ కాంబినేషన్లో జనతాగ్యారేజ్‌ తర్వాత వస్తున్న రెండో సినిమా కావడంతో ఎన్టీఆర్‌ 30పై సినీ వర్గాల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి.