భయానికే వణుకు పుట్టించే.. Devara ఆగమనం..!
Hyderabad: యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తున్న తాజా చిత్రం ఎన్టీఆర్ 30(NTR30). కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మే 20న తారక్ బర్త్‌డే సందర్భంగా సాలిడ్ అప్డేట్ ఇస్తారని అనుకున్నారు. అయితే అనుకున్నదానికంటే ముందే నందమూరి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు కొరటాల.
NTR 30 టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు ‘దేవర’(Devara) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సినిమా ప్రారంభం నుంచే సముద్రం, కత్తులు, రక్తపాతం బ్యాగ్రౌండ్ పోస్టర్లతో బజ్ క్రియేట్ చేసిన కొరటాల ఫస్ట్‌లుక్‌లోనూ ఏమాత్రం తగ్గకుండా ప్లాన్ చేశారు. ఈ పోస్టర్ చూసిన అభిమానులు ఎన్టీఆర్ కెరీర్లో మరో భారీ హిట్ ఖాయమంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్(Jahnvi Kapoor) ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తోంది. ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.