రామ‌య్యే దిగొచ్చిన‌ట్లు..!

Hyderabad: ప్రముఖ ఇతిహాసం రామాయణం(Ramayanam) ఆధారంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్(Adipurush)​. ఈ సినిమాలో పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్(Prabhas)​ రాముడిగా, బాలీవుడ్​ భామ కృతి సనన్​(Kriti Sanon) సీతగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాలీవుడ్​ దర్శకుడు ఓం రౌత్​(Om Raut) రూపొందిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా వెండితెరపై రాముడిగా అలరించిన నటులెవరో ఓ లుక్కేద్దాం..
సీనియర్ ఎన్టీఆర్
శ్రీరాముడిగా ముందుగా సీనియర్ ఎన్టీఆర్ తెరపై కనిపించారు. ఎన్టీఆర్ శ్రీరాముడిగా సంపూర్ణ రామాయణం, శ్రీరామ పట్టాభిషేకం, రామాంజనేయ యుద్ధం సినిమాల్లో కనిపించారు. శ్రీరాముడిగా ఎన్టీఆర్ ను చూసి ఆప్పట్లో ఆయన అభిమానులు మురిసిపోయేవారు. రాముడి స్థానంలో ఎన్టీఆర్​ ఫొటోలు ఇప్పటికీ కనిపిస్తాయి.
అక్కినేని నాగేశ్వర్ రావు
‘సీతారామ జననం’ అనే సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు రాముడిగా కనిపించారు. నిజానికి ఎన్టీఆర్​ కంటే ముందే ఏఎన్నార్​ రాముడిగా కనిపించారనే వాదన కూడా ఉంది.
శోభన్ బాబు
సంపూర్ణ రామాయణం సినిమాలో శోభన్ బాబు రాముడిగా అలరించారు. ఇప్పటికీ టీవీల్లో సంపూర్ణ రామాయణం అశేష ప్రేక్షకాదరణ పొందుతోంది.
సుమన్
రెండో తరం హీరోల్లో దేవుళ్ల గెటప్ షూటయింది సుమన్​కి మాత్రమే. సుమన్ ‘శ్రీరామదాసు’ సినిమాలో రాముడిగా కనిపించారు.
బాలకృష్ణ
సీనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్రలో కనిపించినందుకు ఆయన కొడుకు బాలకృష్ణ కూడా ఆ పాత్రలో కనిపించాలని చాలా మంది అభిమానులు కోరుకున్నారు. దీంతో శ్రీరామరాజ్యం సినిమాలో బాలయ్య రాముడి గెటప్ తో అలరించారు.
జూనియర్ ఎన్టీఆర్
చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ‘బాల రామయణం’లో చిన్న రాముడి గెటప్ తో ఆకట్టుకున్నారు.
ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్ లేటేస్టు మూవీ ఆదిపురుష్. ఈ సినిమా టీజర్ కూడా విడుదలయింది. ఇందులో రాముడి గెటప్ లో ప్రభాస్ కనిపించారు.
ఇక దేవుళ్లు సినిమాలో శ్రీకాంత్ రాముడిగా కనిపిస్తారు. ఇందులో కనిపించింది కాసేపు అయినా శ్రీకాంత్ తన నటనతో ఆకట్టుకున్నారు. ఇంకా చాలా మంది నటులు రాముడి పాత్రలో అలరించారు.