Prashanth Neel బ‌ర్త్‌డే.. తార‌క్ నుంచి నోరూరే ట్రీట్!

Hyderabad: డైన‌మిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ (prashanth neel) నిన్న 43వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌శాంత్ తన ఇంట్లో గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. పార్టీకి యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ (prabhas) వెళ్లారు. ప్ర‌శాంత్ చేత కేట్ క‌ట్ చేయించి గ్రాండ్‌గా సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. అయితే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (jr ntr) దుబాయ్ వెకేష‌న్ నుంచి నిన్నే రావ‌డంతో బ‌ర్త్‌డే పార్టీకి వెళ్ల‌లేక‌పోయారు. దాంతో ప్ర‌శాంత్‌కు తార‌క్ (tarak) సర్‌ప్రైజ్ ఇవ్వాల‌నుకున్నారు. స్పెష‌ల్‌గా కోడి పులుసు త‌యారుచేయించి ప్ర‌శాంత్‌కు పంపారు. ఈ విష‌యాన్ని ప్ర‌శాంత్ భార్య లిఖిత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్ల‌డిస్తూ కోడి పులుసు ఫొటో షేర్ చేసారు. క్యాప్ష‌న్‌లో థ్యాంక్స్ అన్న‌య్యా.. అని పెట్టారు. ప్ర‌శాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో NTR31 సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇంకా టైటిల్ ఫిక్స్ అవ్వ‌లేదు. ప్ర‌స్తుతం తార‌క్.. కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో దేవ‌ర సినిమాలో న‌టిస్తున్నారు. మ‌రోప‌క్క ప్ర‌శాంత్.. ప్ర‌భాస్‌తో క‌లిసి స‌లార్ చేస్తున్నారు. స‌లార్, దేవ‌ర షూటింగ్స్ అయ్యాక‌.. ప్ర‌శాంత్, తార‌క్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంద‌ని తెలుస్తోంది.