NTR: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌పై తెలుగు తేజం!
New York: అసమానమైన నటనతోపాటు సాటిలేని వ్యక్తిత్వం, అకుంఠిత దీక్షతో అనుకున్న సాధించే సంకల్పంతో యుగ పురుషుడిగా పేరు తెచ్చుకున్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావు(NTR). ఎన్టీఆర్ నట జీవితంలో ఆయన ధరించని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదు. పౌరాణికం, సాంఘికం, జానపదం.. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను మెప్పించేవారు. నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగానూ విజయం సాధించిన ఘనత ఆయనకే సొంతం. తెలుగు జాతిని దేశ రాజకీయపటంలో అగ్రపథాన నిలిపిన ఘనుడు ఎన్టీఆర్. మే 28న ఎన్టీఆర్ శత జయంతి(NTR 100th Birth Anniversary) వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు, అభిమానులు.
కాగా, ప్రపంచంలోనే ప్రధానమైన కమర్షియల్ జంక్షన్, టూరిస్ట్ డెస్టినేషన్, ఎంటర్టైన్మెంట్ హబ్ అయిన టైమ్స్ స్క్వేర్(New York Times Square) తెలుగు వారితో నిండిపోయింది. ఎన్టీఆర్ 100వ జన్మదినం సందర్భంగా అమెరికా న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ పై ఎన్టీఆర్ చిత్రాలను ప్రదర్శించారు. ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం నుంచి ఆయన ధరించిన పాత్రలు, రాజకీయ ప్రయాణం అన్నీ కళ్లకు కట్టినట్లు చూపేలా పలు ఫొటోలను ప్రదర్శించారు. ప్రతి 4 నిమిషాలకు ఒకసారి 15 సెకన్ల చొప్పున ఎన్టీఆర్‌కు సంబంధించిన విభిన్న చిత్రాలను ఈ ప్రకటన ద్వారా ప్రసారం చేయనున్నారు.
టైమ్స్ స్క్వేర్ పై 200 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పు తెరపై మే 27 అర్ధరాత్రి నుంచి 28 అర్ధరాత్రి వరకు ఏకధాటిగా 24 గంటలపాటు ఎన్టీఆర్ ఫొటోలు ప్రదర్శించారు. ఎన్నారై టీడీపీ – అమెరికా ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. కాగా, ఒక తెలుగు వ్యక్తి ఫొటోలు ఇలా టైమ్స్ స్క్వేర్‌పై ఒక రోజంతా ప్రదర్శితమవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
Times square NYC ❤️
Telugu pride Annagaru 🙏#100yearsofNTR #LegendaryNTRJayanthi pic.twitter.com/gg4PMG4PoF— NTR FANS USA (@NTRFans_USA) May 28, 2023