NTR30: తారక్‌-జాన్వి సినిమాకు క్రేజీ టైటిల్!

Hyderabad: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్(ntr), జాన్వి క‌పూర్(janhvi kapoor) న‌ట‌స్తున్న సినిమాకు క్రేజీ టైటిల్ ఫిక్స్ అయింది. NTR30 వ‌ర్కింగ్ టైటిల్‌తో స్టార్ట్ అయిన ఈ సినిమాకు దేవ‌ర(devara) అనే టైటిల్‌ను ఖ‌రారు చేయ‌నున్నారు. త్వ‌ర‌లో దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ చేయ‌నున్నారు. ఇందులో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. కొర‌టాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. తార‌క్, కొర‌టాల కాంబినేష‌న్‌లో రాబోతున్న సెకండ్ సినిమా ఇది. గ‌తంలో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. ఇప్ప‌టికే సగానికి పైగా షూటింగ్ అయిపోయింద‌ని టాక్. హైద‌రాబాద్‌లో వైలెంట్ సీన్‌కు సంబంధించిన షూటింగ్ జ‌రుగుతోంది. ఈ వారంలో ఓ పోస్ట‌ర్‌ను కూడా రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు టాక్. తెలుగు, హిందీ, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నార‌ట‌. అన్ని భాష‌ల్లో దేవ‌ర అనే టైటిల్‌నే పెట్బోతున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.