Nora Fatehi బ్యూటీ సీక్రెట్స్!
Hyderabad: బాహుబలి(Bahubali) సినిమాలో ‘మనోహరి..’ పాటతో టాలీవుడ్‌కు పరిచయమైన బాలీవుడ్(Bollywood) బ్యూటీ నోరా ఫతేహి(Nora Fatehi). ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఒక్క పాటతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. మొరాకో మూలాలున్న నోరా కెనడాలో జన్మించింది. మోడల్, డాన్సర్, సింగర్, నటిగా రాణిస్తోంది. 31 ఏళ్ల ఈ బ్యూటీక్వీన్ డాన్స్‌కు లక్షల్లో అభిమానులు ఉన్నారు. రోర్ మూవీతో తెరంగేట్రం చేసిన నోరా హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటిస్తోంది. పొలిటికల్ సైన్స్ చదివిన నోరా కెనెడియన్ అయినా ఆత్మీయతను పంచడంలో భారతీయులు ఏమాత్రం తీసిపోరంటూ పలు సందర్భాల్లో ఇండియాపై తన అభిమానం చాటుకుంది ఈ సోగకళ్ల సుందరీ.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బ్యూటీ సీక్రెట్ పంచుకుంది నోరా. ‘అందాన్ని కాపాడుకోవడానికి కంపెనీ ఉత్పత్తులకంటే సహజ పద్ధతులనే ఎక్కువగా ఫాలో అవుతాను. నీళ్లు బాగా తాగుతాను. రోజూ నా భోజనంలో తాజా పండ్లు, ఆకు కూరలు, కూరగాయలు ఉండేలా చూసుకుంటాను. వారానికి ఒకసారి ఫేస్‌కి గ్రీన్ టీ ప్యాక్ వేసుకుంటా. గ్రీన్ టీ ఆకులను తేనెలో కలిపి దాన్ని ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటా. ఆరిపోయాక చన్నీళ్లతో కడిగేసుకుంటా. ఇవన్నీకాక.. మొహం నిత్యం మెరుస్తూండడానికి నా చర్మానికి సరిపడే ఫేషియల్ ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటాను. గ్రీన్ టీ ప్యాక్, ఫేషియల్ ఆయిల్ మసాజ్‌లు మా అమ్మ చెప్పిన చిట్కాలే’ అంటూ చెప్పుకొచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ.