Nora Fatehi: టీవీ షోలో హీరోయిన్ “అడ‌ల్ట్” డ్యాన్స్‌

Nora Fatehi: ప్ర‌ముఖ బాలీవుడ్ ఐటెం బాంబ్, హీరోయిన్ నోరా ఫ‌తేహి ఓ టీవీ షోలో అడ‌ల్ట్ డ్యాన్స్‌లు వేయ‌డం వివాదాస్ప‌దంగా మారింది. ఫ్యామిలీ చూసే టీవీ షోల‌ల్లో ఇలాంటి వారిని పిలిపించి ద‌రిద్ర‌మైన అస‌భ్య‌క‌ర డ్యాన్సులు ఎలా చేయిస్తారంటూ నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. నోరా అలా డ్యాన్స్ చేస్తున్న‌ప్పుడు షోలో ఉన్న‌వారు కూడా ఏం చేయాలో తెలీక అలా నోరెళ్ల‌బెట్టి చూస్తుండిపోయారు. వారు ఏమ‌న్నా అంటే కాంట్రాక్ట్‌లు ఆగిపోతాయి.. డ‌బ్బులు రావ‌న్న భ‌యంతో మౌనంగా ఉండిపోతున్నారు. ఇప్ప‌టికే మితిమీరిన వైలెన్స్, సెక్స్ స‌న్నివేశాలు ఉన్న సినిమాలు స‌మాజాన్ని భ్ర‌ష్ఠుప‌ట్టిస్తున్నాయి. క‌నీసం టీవీ షోలల్లో అయినా కాస్త ప‌ద్ధ‌తిగా ఉంటే బాగుంటుంద‌ని నెటిజ‌న్లు క్లాస్ పీకుతున్నారు.