Vijay Devarakonda: పాట‌ల్లేవ్.. పాడుకోవ‌డాల్లేవ్..!

Vijay Devarakonda: ఫ్యామిలీ స్టార్‌తో మ‌రో ఫ్లాప్‌ను ఖాతాలో వేసుకున్నారు విజయ్ దేవ‌ర‌కొండ‌. అందుకే ఈసారి ఆచి తూచి మంచి స్క్రిప్ట్ ఉన్న సినిమాను ఎంచుకోనున్నారు.  జ‌ర్సీ సినిమా ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌కత్వంలో వ‌స్తున్న సినిమాలో విజ‌య్ న‌టిస్తున్నారు. ఈ సినిమాలో అస‌లు ఎలాంటి పాట‌ల‌కు ఆస్కారం లేద‌ట‌. విజ‌య్ సినిమాల్లో పాటలే హైలైట్ అవుతాయి. కానీ ఇప్పుడు న‌టిస్తున్న సినిమాలో మాత్రం పాట‌ల‌కు ఆస్కారం లేకుండా కేవ‌లం క‌థ‌పైనే సినిమా సాగ‌నుంద‌ని తెలుస్తోంది. విజ‌య్ సినిమాలోని పాట‌ల వ‌ల్లే సినిమా చాలా నెమ్మ‌దిగా సాగుతూ బోర్ కొట్టిస్తోందని చాలా మంది ఆడియ‌న్స్ ఫిర్యాదులు చేసారు. అందుకే ఈసారి పాట‌లు లేని సినిమాతో కొత్త ఎక్స్‌ప‌రిమెంట్ చేయాల‌ని విజ‌య్ అనుకుంటున్నార‌ట‌.