Nikhil Siddhartha: ఈసారి ఎవ్వరికీ తలొంచేదేలే..!
Hyderabad: నిఖిల్ సిద్ధార్థ్ (nikhil siddhartha) నటించిన స్పై (spy) సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. నిఖిల్ కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్ సినిమాగా నిలిచింది. ఈ సందర్భంగా ఆడియన్స్‌కి థ్యాంక్స్ చెప్తూ ఓ పోస్ట్ పెట్టారు. “స్పై సినిమాను ఇంత బిగ్గెస్ట్ హిట్ చేసి నా కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్ సినిమాగా చేసినందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సందర్భంగా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ప్రేక్షకులకు సారీ చెప్పాలనుకుంటున్నాను. కంటెంట్, కాంట్రాక్ట్‌కు సంబంధించిన అంశాలు డిలే అవడంతో సరిగ్గా సినిమాను అన్ని భాషల్లో రిలీజ్ చేయలేకపోయాం. ఇదే కారణం వల్ల ఓవర్‌సీస్‌లో 350 తెలుగు షోలు క్యాన్సిల్ అయ్యాయి. నా నుంచి రాబోయే తర్వాతి 3 సినిమాలు ఇతర భాషల్లోనూ రిలీజ్ అవుతాయని ప్రామిస్ చేసి చెప్తున్నా. ఈసారి ఎవ్వరు ఎంత ఒత్తిడి చేసినా తగ్గేదేలా. నాపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ నేను చెప్పేది ఒక్కటే. ఈ సారి క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గకుండా చక్కని సినిమాను మీ ముందుకు తెస్తాను” అని తెలిపారు.
ఈ సినిమాను గ్యారీ డైరెక్ట్ చేసారు. అతను ఒకప్పుడు ఎడిటర్‌గా పనిచేసేవాడు. సినిమా జూన్ 29కే రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ అప్పటికి ఎడిటింగ్, గ్రాఫిక్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అయినా కూడా సినిమాను అనుకున్న డేట్‌కే రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్ పట్టుబట్టారు. దాంతో ఈ విషయంలో నిఖిల్‌కి ప్రొడ్యూసర్‌కి గొడవ జరిగింది. ఇకపై ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా మంచి క్వాలిటీ కంటెంట్ ఉన్న సినిమానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని నిఖిల్ తెలిపారు.