Niharika: ఎప్పటినుంచో వెయిటింగ్.. వెల్‌కం వదిన!
Hyderabad: ఎప్పటినుంచో ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నా.. వెల్‌కం టు ది ఫ్యామిలీ వదిన అంటూ నిహారిక కొణిదెల (niharika) చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ (varun tej lavanya engagement) నిన్న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఎంగేజ్‌మెంట్ పిక్స్ అన్నీ ఒక్కొక్కటి రిలీజ్ అవుతున్నాయి. నిహారిక తనకు కాబోయే వదినతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసారు. మరోపక్క మెగా స్టార్ చిరంజీవి (chiranjeevi) కూడా కంగ్రాట్స్ చెప్తూ కాబోయే దంపతుల ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.