Niharika Konidela: అల్లు అర్జున్ వివాదంపై స్పందించిన నిహారిక
Niharika Konidela: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ విషయం ఎంత వివాదాస్పదంగా మారిందో తెలిసిందే. నంద్యాల నుంచి పోటీ చేస్తున్న తెలుగు దేశం అభ్యర్ధికి బన్నీ సపోర్ట్ చేయకుండా.. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ఇవ్వడం వైరల్‌గా మారింది. కిశోర్ రెడ్డి బన్నీ భార్య స్నేహారెడ్డికి మంచి మిత్రుడు. అలా బన్నీకి కూడా మిత్రుడు అయ్యాడు.
అయితే 2019 ఎన్నికల సమయంలోనే బన్నీ కిశోర్ రెడ్డికి ఎన్నికల్లో పోటీ చేస్తే నా మద్దతు నీకే బ్రదర్ అని మాటిచ్చారట. అప్పట్లో నిలబెట్టుకోలేకపోవడంతో మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన నంద్యాల వెళ్లి మరీ మద్దతు ప్రకటించారు. అది జనసేన నేత నాగబాబుతో పాటు కుటుంబీకులకు కూడా నచ్చలేదు. ఆల్రెడీ సాయిధరమ్ తేజ్ అల్లు అర్జున్, స్నేహారెడ్డిలను సోషల్ మీడియాలో అన్‌ఫాలో అయ్యాడు.
దీనిపై నాగబాబు కూతురు నిహారిక స్పందించారు. “” ఆధ్యాత్మికత విషయంలో అయినా.. సినిమాలు రాజకీయాల విషయాల్లో అయినా ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి. ఒకరికి ఒకటి నచ్చితే అది కుటుంబ సభ్యుల్లోని అందరికీ నచ్చాలని లేదు కదా. మద్దతు ఇస్తేనే కుటుంబ సభ్యుడివి లేదంటే లేదు అని మనం అనుకుంటామా చెప్పండి. మా నాన్న ట్విటర్‌లో వాట్సాప్‌లో చెత్త చెత్త పోస్ట్‌లు పెడుతుంటారు. ఇంట్లో అల్లు అర్జున్ టాపిక్ అయితే అస్సలు రాలేదు “” అని తెలిపారు.