Niharika Konidela: ప్రేమ పెళ్లి యోచనలో నిహారిక?
Niharika Konidela: మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల రెండో పెళ్లి చేసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda) అనే యువకుడితో నిహారిక వివాహం రాజస్థాన్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కానీ రెండేళ్లకే వీరి కాపురంలో సమస్యలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రెండో పెళ్లి విషయంలో నిహారిక ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నిహారిక సాగు అనే సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన రెండో పెళ్లి గురించి మాట్లాడారు. తనకు పిల్లల్ని కనాలని ఉందని ఒక ఫ్యామిలీ ఉంటే బాగుంటుందని అనిపిస్తోందని తెలిపారు. అలాగని కేవలం పిల్లల కోసమే పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని.. తనకు ప్రేమపై ఎలాంటి నెగిటివ్ అభిప్రాయం లేదని వెల్లడించారు. చూడబోతే ఈసారి పెద్దలు కుదిర్చిన వివాహం కాకుండా ప్రేమ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
చైతన్యతో తన విడాకుల గురించి వెల్లడిస్తూ.. చాలా మంది ఎందుకు విడిపోవాల్సి వచ్చిందని అడుగుతున్నారని.. దీనికి వంద కారణాల ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైతే తాను తన వర్క్‌పై మాత్రమే ఫోకస్ చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.
ALSO READ: Niharika Konidela: నిహారికను హర్ట్ చేసిన ఆ నటుడు ఎవరు?