మీకు గడ్డం వస్తుందా.. రష్మిక పోస్ట్​కు నెటిజన్​ చెత్త కామెంట్​

Hyderabad: నేషనల్​ క్రష్​ రష్మికా మందన్నా(Rashmika Mandanna)కు సోషల్​ మీడియాలో నెగెటివ్​ కామెంట్స్​ బాధ రోజురోజుకీ పెరుగుతోంది. టాలీవుడ్​తోపాటు బాలీవుడ్(Bollywood)​లోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది రష్మిక. అల్లు అర్జున్(Allu Arjun)​ హీరోగా సుకుమార్​(Sukumar) దర్శకత్వంలో వచ్చిన పుష్ప(Pushpa) సినిమాతో పాన్​ ఇండియా హీరోయిన్​గా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రష్మికకు కెరీర్​ మొదటినుంచీ ట్రోల్స్​ బాధ తప్పడం లేదు. ఎప్పుడూ ఏదోరకంగా రష్మికను ట్రోల్​ చేసే నెటిజనులు ఈసారి మరీ దారుణమైన కామెంట్స్​తో హద్దులు మీరి ప్రవర్తించారు.

కెరీర్​ మొదట్లోనే వరుస అవకాశాలను పట్టేసిన రష్మిక మహేష్​ బాబు(Mahesh Babu), అల్లు అర్జున్​, విజయ్​ దేవరకొండ(Vijay Deverakonda) వంటి టాప్​ హీరోలతో నటించింది. ప్రస్తుతం పుష్ప2(Pushpa2)తో పాటు బాలీవుడ్​ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే రష్మిక తన ఆలోచనలు, విశేషాలను తరచూ సోషల్​ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా రష్మిక షేర్​ చేసిన ఒక ఫొటోకి దారుణమైన కామెంట్లతో రెచ్చిపోయారు నెటిజన్లు.

రష్మిక తన ఇన్​స్టాలో ‘నాకు బుంగమూతి పెట్టడం రావట్లేదు.. ’ అంటూ ముద్దు పెడుతున్నట్లు ఉన్న ఓ ఫొటోని జోడించింది. కాగా, ఈ ఫొటోకి రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. అభిమానులు హార్ట్​ ఇమోజీలతో మెచ్చుకుంటుంటే కొందరు మాత్రం హద్దులు మీరి అసభ్యంగా కామెంట్​ చేస్తున్నారు. ‘మీకు గడ్డం వస్తుందా..’ అని ఒకరంటే, ‘అరే.. దవడ కింద గడ్డం వచ్చినట్టుందే’ అంటూ ఒకరూ కామెంట్​ చేశారు. మరి ఈ కామెంట్స్​పై రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి!