Neha Shetty: రాధిక అక్క న్యూ లుక్!

Hyderabad: డీజే టిల్లు (dj tillu) సినిమాలో రాధిక క్యారెక్ట‌ర్‌తో తెగ ఫేమ‌స్ అయిపోయింది నేహా శెట్టి (neha shetty). ఇప్పుడు ఆమె బెదురులంక (bedurulanka) సినిమాతో ఆడియ‌న్స్ ముందుకు రాబోతోంది. ఇప్ప‌టివ‌ర‌కు నేహా చాలా సినిమాలు చేసిన‌ప్ప‌టికీ డీజే టిల్లు తెచ్చిన స్టార్‌డం మ‌రే సినిమా ఇవ్వ‌లేక‌పోయింది. ఇప్ప‌టికీ నేహాను ఫ్యాన్స్ రాధిక అక్క అనే ఆట‌పట్టిస్తుంటారు. డీజే టిల్లు పార్ట్ 2 (tillu square)లో కూడా నేహానే ఉంటుంద‌ని ఫ్యాన్స్ అనుకున్నారు కానీ ఆమె ప్లేస్‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్‌ను (anupama parameshwaran) తీసుకున్నారు. అయితే ఇప్పుడు నేహా బెదురులంక‌లో మ‌రో ఇంట్రెస్టింగ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం కొత్త లుక్‌లో రెడీ అయింది నేహా. న‌న్ను మ‌ళ్లీ మీకు ప‌రిచ‌యం చేసుకోనివ్వండి అంటూ సోష‌ల్ మీడియాలో పెట్టిన ఫొటోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి.