Neena Gupta: కిస్సింగ్ సీన్.. డెటాల్‌తో నోరు క‌డుక్కున్నా

Mumbai: కిస్సింగ్ సీన్‌లో న‌టించిన త‌ర్వాత డెటాల్‌తో నోరు క‌డుక్కోవాల్సి వ‌చ్చింద‌ని అన్నారు సీనియ‌ర్ బాలీవుడ్ న‌టి నీనా గుప్తా (neena gupta). నీనా కీ రోల్‌లో న‌టించిన ల‌స్ట్ స్టోరీస్-2 (lust stories 2) OTTలో రిలీజ్ అయింది. 60 ప్ల‌స్ వ‌య‌సులోనూ బోల్డ్ క్యారెక్ట‌ర్స్‌లో న‌టిస్తున్నారు నీనా. అయితే తాను సినిమాల్లోకి వ‌చ్చిన కొత్త‌లో ఫస్ట్ టైం కిస్సింగ్ సీన్‌లో న‌టించాల్సి వ‌స్తే ఏం చేసారో చెప్పారు. “ఒక యాక్ట‌ర్‌గా మేం చాలా చేయాల్సి వ‌స్తుంది. బుర‌ద‌లో దూక‌మంటే దూకాలి. ఎండలో గంట‌ల త‌ర‌బ‌డి నిల‌బ‌డ‌మంటే నిల‌బ‌డాలి. చాలా ఏళ్ల క్రితం ఓ సీరియ‌ల్‌లో న‌టించాను. అప్పుడే నేను ఫ‌స్ట్ కిస్సింగ్ సీన్‌లో న‌టించాను. ఆ రాత్రంతా నిద్ర‌పట్ట‌లేదు. ఆ కిస్సింగ్ సీన్ అవ్వగానే నేను నా నోరుని డెటాల్‌తో క‌డుక్కున్నాను” అని తెలిపారు నీనా.