NBK108: స్పెషల్​ సాంగ్​లో స్టార్​ హీరోయిన్!

Hyderabad: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్నసినిమా NBK108. అఖండ(Akhanda), వీర సింహా రెడ్డి(Veera Simha Reddy) సినిమాలతో బ్యాక్​ టు బ్యాక్​ హిట్లతో ఫుల్​ ఫామ్​లో ఉన్న బాలయ్య వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. ప్రస్తుతం NBK 108 షూటింగ్​తో బిజీగా ఉన్నారు బాలయ్య. ఇక ఈ సినిమాలో ఇప్పటికే కాజల్​ అగర్వాల్(Kajal Aggarwal)​, శ్రీలీల(Sreeleela) హీరోయిన్లుగా ఎంపికయ్యారు. కాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్​డేట్​ లీక్​ అయ్యింది. ఈ సినిమాలో టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ ఓ స్పెషల్​ సాంగ్​ చేయనుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో ఓ స్పెషల్​ సాంగ్​ స్టార్​ హీరోయిన్​తో చేయిస్తే బాగుంటుందని భావిస్తున్నారట అనిల్​ రావిపూడి. అందుకే ఇటీవలే ఈ విషయంలో పూజా హెగ్డేతో సంప్రదింపులు జరుగుతున్నాయని టాక్. పూజ ఇప్పటికే మెగా పవర్​ స్టార్​ రామ్​ చరణ్, సుకుమార్​ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమాలో ‘జిగేల్​ రాణి’గా అలరించిన సంగతి తెలిసిందే. ఎవర్​గ్రీన్​ ఎనర్జీతో అదరగొట్టే పూజ, బాలయ్యతో చిందేస్తే నందమూరి అభిమానులకు పూనకాలే. ప్రస్తుతం పూజ మహేష్ బాబు, త్రివిక్రమ్​ కాంబినేషన్లో రూపొందుతున్న SSMB28 సినిమాలో నటిస్తోంది.