Nayanthara Vignesh: విడిపోవడంలేదు.. మరీ ఇంత అవసరమా?
Nayanthara Vignesh: లేడీ సూపర్‌స్టార్ నయనతార, విఘ్నేష్ శివన్‌లు విడిపోతున్నారని కొన్ని రోజులుగా టాక్ నడుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడైతే నయన్.. విఘ్నేష్‌ని అన్‌ఫాలో చేసిందో అప్పటినుంచి ఈ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత మళ్లీ నయన్ విఘ్నేష్‌ని ఫాలో అవ్వడంతో విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టినట్లు అయ్యింది.
ఆ తర్వాత రెండు రోజుల గ్యాప్‌లోనే నయన్.. ఐ యామ్ లాస్ట్ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. దాంతో మళ్లీ ఏమైందబ్బా అనే చర్చ మొదలైంది. కచ్చితంగా విఘ్నేష్, నయన్‌ల దాంపత్య జీవితంలో ఏదో సమస్య ఉందని అందరూ అనుకోవడం మొదలుపెట్టారు. విడాకులు ప్రకటించేస్తారేమో అని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తన భర్త, పిల్లలతో కలిసి చాలా కాలం తర్వాత ట్రిప్‌కి వెళ్తున్నట్లు ఫోటో పెట్టి విడాకుల రూమర్స్‌కి చెక్ పెట్టారు. ఆ తర్వాత నుంచి వరుసగా విఘ్నేష్, నయన్‌ను పోటీ పడుతూ తమ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్నారు.
ఇక్కడ మ్యాటర్ ఏంటంటే.. తాము విడిపోవడం లేదని అందరికీ ఇంత గట్టిగా చెప్పాలా? విడాకులు తీసుకోకుండా కలిసే ఉన్నాం హ్యాపీగా ఉన్నామని ఏదో ఫ్యాన్స్‌కి ప్రూవ్ చేయడానికి బ్యాక్ టు బ్యాక్ ఫోటోలు షేర్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇలాంటి విడాకుల రూమర్స్ రాక ముందు వరకు నయన్ కానీ విఘ్నేష్ కానీ మరీ ఇన్ని ఫోటోలను ఎప్పుడూ పోస్ట్ చేయలేదు. మరి ఇప్పుడెందుకు ఇలా? అనే చర్చ మొదలైంది. ఎవరి జీవితం వారిది అన్నీ బూతద్దంలోనే చూడాలా అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. కానీ వారు సెలబ్రిటీలు కదా.. ! వారి పర్సనల్ లైఫ్ గురించి ఆ మాత్రం క్యూరియాసిటీ ఫ్యాన్స్‌కి కూడా ఉంటుంది మరి..!