Nayanthara: సైడ్ క్యారెక్టర్‌గా మార్చేసార‌ట‌..డైరెక్ట‌ర్‌పై అల‌క‌

లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార (nayanthara) జ‌వాన్ (jawan) సినిమాతో బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ (atlee) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో షారుక్ ఖాన్ (shahrukh khan), న‌య‌న‌తార‌, దీపిక ప‌దుకొణె (deepika padukone) కీల‌క రోల్స్ ప్లే చేసారు. అయితే ఈ సినిమాలో చాలా మ‌టుకు న‌య‌న‌తార సీన్లు క‌ట్ చేసి ఎక్కువ‌గా దీపిక‌ను హైలైట్ చేసార‌ట‌. అస‌లైతే ఇందులో దీపిక కేమియో రోల్ ప్లే చేసారు. కానీ సినిమాలో మాత్రం న‌య‌న‌తార కేమియో రోల్ ప్లే చేసిన‌ట్లుగా మార్చేసార‌ని న‌య‌న్ అట్లీపై అలిగిన‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. ఈ కార‌ణం వ‌ల్ల ఇక న‌య‌న్ బాలీవుడ్ సినిమాల్లో న‌టించకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.