Tiku Weds Sheru: 49 ఏళ్ల హీరో.. 21 ఏళ్ల హీరోయిన్‌కి లిప్ కిస్!
Mumbai: తండ్రి వయసులో నటించాల్సిన వారు ఇప్పటికీ హీరోల క్యారెక్టర్స్‌లోనే నటిస్తున్నారు (tiku weds sheru). నటిస్తే నటించారు.. మరీ 21 ఏళ్ల అమ్మాయిని హీరోయిన్‌గా పెడితే ఆ అమ్మాయితో ఏకంగా డైరెక్ట్ లిప్ కిస్ సీన్స్ పెట్టేస్తున్నారు. దాంతో ఆడియన్స్ కూడా ఇలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడటంలేదు. ఇంతకీ ఇప్పుడు ఏం జరిగిందంటే.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (kangana ranaut) తన ప్రొడక్షన్ హౌస్ నుంచి టికు వెడ్స్ షెరు (tiku weds sheru) అనే సినిమాను ప్రొడ్యూస్ చేసింది. ఇందులో 49 ఏళ్ల నవాజుద్దిన్ సిద్ధిఖి (nawazuddin siddiqui) హీరోగా, 21 ఏళ్ల అవ్నీత్ కౌర్ (avneet kaur) హీరోయిన్‌గా నటించారు. సినిమాలో నవాజుద్దిన్ అవ్నీత్‌కు లిప్ కిస్ ఇచ్చే సన్నివేశాలు ఉన్నాయి. దాంతో ఇప్పుడు ఇది తీవ్ర చర్చకు దారితీసింది. ఇంత వయసు వచ్చినా హీరోలుగా నటిస్తున్నారు సరిపోవడంలేదా? వయసులో కూతురులాంటిదైన అమ్మాయికి లిప్ కిస్ పెట్టించాల్సిన అవసరం ఏముంది అని తిట్టిపోస్తున్నారు. ఆ మాట నిజమే. లిప్ కిస్ లేకుండా కూడా తెరకెక్కించే సన్నివేశాలు ఉంటాయి. లేదా కిస్ చేసుకుంటున్నట్లు చూపించకుండా ఉండాల్సింది. అదేమంటే అది స్క్రిప్ట్‌లో భాగమని ఈజీగా అనేస్తున్నారు. దీనిపై సెన్సార్ ఓ కన్నేసి ఉంచితే బెటర్ అని విశ్లేషకుల అభిప్రాయం.