Navdeep: బతికే ఉన్నామని చెప్పుకోవాల్సి వస్తోంది!
Hyderabad: కొన్ని వెబ్సైట్ల వల్ల సెలబ్రిటీలు బతికే ఉన్నామని వీడియోలు పోస్ట్ చేయాల్సి వస్తోందని మండిపడ్డారు నవదీప్ (navdeep). సీనియర్ నటుడు సుధాకర్ (sudhakar) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. దాంతో ఆయన వెంటనే ఓ వీడియో రిలీజ్ చేసారు. తనకు ఏమీ కాలేదని, సంతోషంగా ఉన్నానని, తప్పుడు వార్తలను నమ్మవద్దు అని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయమై నవదీప్ (navdeep) ట్వీట్ చేసారు. బతికే ఉన్నామని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని, వ్యూస్ కోసం ఇంత నీచానికి దిగజారుతారని అనుకోలేదని మండిపడ్డారు. గతంలో కూడా దివంగత నటుడు శరత్ బాబు (sarath babu) హాస్పిటల్లో చికిత్స పొందుతుండగానే చనిపోయారని రాసేసారు. దాంతో కుటుంబ సభ్యులు, హాస్పిటల్ సిబ్బంది తాము స్వయంగా ప్రకటిస్తే తప్ప ఏ వార్తలు నమ్మవద్దని స్పష్టం చేసారు.
సీనియర్ నటులు కోటా శ్రీనివాసరావు (kota srinivasarao), చంద్రమోహన్లు (chandra mohan) కూడా గతంలో తాము బాగానే ఉన్నామంటూ వీడియోలు రిలీజ్ చేసారు. ఇలాంటి వెబ్సైట్లపై, ఛానెళ్లపై తీవ్ర చర్యలు తీసుకోవాలని సెలబ్రిటీలు కూడా డిమాండ్ చేస్తున్నారు. సెలబ్రిటీలపై ఎన్ని రూమర్లు రాసినా భరిస్తారేమో కానీ ఏకంగా మనిషే లేడంటూ రాసేస్తే ఆ తర్వాత జరిగే పర్యావసనాలు చాలా తీవ్రంగా ఉంటాయని, నిజమే అనుకుని ఎవరికైనా ఏమన్నా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.