Natti Kumar: అల్లు అర్జున్ వ‌ల్ల ప‌వ‌న్ ఓడిపోవ‌డం అనేది జ‌ర‌గ‌దు

Natti Kumar sensational comments on Allu Arjun

Natti Kumar:  అల్లు అర్జున్ వైఎస్సార్ కాంగ్రెస్ నేత శిల్పా ర‌విచంద్ర కిశోర్ రెడ్డి కోసం ప్రచారం చేసినంత మాత్రాన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓడిపోడ‌ని అన్నారు ప్ర‌ముఖ నిర్మాత న‌ట్టి కుమార్. సాధార‌ణంగా తాను రాజ‌కీయాల గురించి మాట్లాడ‌న‌ని.. కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి అల్లు అర్జున్ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మార‌డంతో తాను ప్రెస్ మీట్ పెట్టి త‌న అభిప్రాయాన్ని చెప్పాల‌నుకున్నాన‌ని తెలిపారు. ఎన్నిక‌ల్లో కూట‌మిదే గెలుప‌ని.. వైఎస్సార్ కాంగ్రెస్‌లోని దాదాపు అంద‌రు ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్థులు ఓడిపోబోతున్నార‌ని తెలిపారు. అల్లు అర్జున్ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్య‌ర్ధి కోసం ప్ర‌చారం చేసినా ఆయ‌న చేతులు ఊపినా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓడిపోతాడు అనుకోవ‌డం అమాయ‌క‌త్వం అని తెలిపారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు 99 శాతం మ‌ద్ద‌తు ఉంద‌ని.. ఆ మ‌ద్ద‌తుతో బంప‌ర్ మెజారిటీతో గెలుస్తార‌ని తెలిపారు.