Natti Kumar: దర్శకుడు సుకుమారే జానీ మాస్టర్‌ను ఇరికించారు
Natti Kumar: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోక్సో కేసుపై అరెస్ట్ అయ్యి రిమాండ్‌లో ఉన్నారు. ఆయనపై పెద్ద కుట్ర జరిగిందని.. ఆ కుట్ర వెనుక దర్శకుడు సుకుమార్ ఉన్నాడంటూ సంచలన ఆరోపణలు చేసారు ప్రముఖ నిర్మాత నట్టి కుమార్.
“” నేను జానీ మాస్టర్‌తో పని చేయలేదు. కానీ మా ఇండస్ట్రీకి చెందిన ఓ మనిషిని దారుణంగా కుట్రలో ఇరికించి కుటుంబాన్ని వీధిన పడేసారు. అందుకే నేను ఆయనకు మద్దతు తెలుపుతున్నాను. జానీ మాస్టర్‌పై తప్పుడు కేసు పెట్టేలా చేసింది దర్శకుడు సుకుమారే. ఓ హీరో సినిమా కోసం సుకుమార్ జానీ మాస్టర్‌ను సంప్రదించారు. కానీ జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరడంతో తాను రాజకీయాల్లో బిజీగా ఉన్నానని చెప్పి రాలేను సర్ అని చెప్పాడు. అది సుకుమార్‌కి నచ్చలేదు. పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్లు ఒప్పుకోనప్పుడు వేరే కొరియోగ్రాఫర్ వచ్చినా దర్శకులు ఏమీ అనరు కానీ అసిస్టెంట్లు వస్తే మాత్రం కొరియోగ్రాఫర్లు అస్సలు ఒప్పుకోరు. రాకేష్ మాస్టర్ విషయంలోనూ ఇదే జరిగింది.
దాంతో సుకుమార్‌కి జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన అమ్మాయి విషయంలో అన్యాయం జరిగిందని అనిపించింది. ఆయనే భరద్వాజ్ అనే వ్యక్తికి ఫోన్ చేసి ఆ అమ్మాయికి మద్దతు ఇవ్వండి అని చెప్పారు. భరద్వాజ్ చెప్పింది చేయకుండా ఒక అడుగు ముందుకేసి కేసు విచారణలో ఉండగానే మీడియా ముందుకు వచ్చి జానీ మాస్టర్ తప్పు చేసాడంటూ ఆయన కార్డును క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు. అది చాలా తప్పు. ఇంకా కోర్టు నిర్ణయించకుండానే జానీ మాస్టర్ తప్పు చేసాడని మీరెలా ప్రకటిస్తారు? మీ తప్పుడు ప్రకటన వల్ల జానీ మాస్టర్ పిల్లలు స్కూల్‌కి వెళ్తే మీ నాన్న అలా చేసాడు కదా అని వారిని అవమానిస్తున్నారు. జానీ మాస్టర్ భార్య నలుగురికీ సమాధానం చెప్పుకోలేక నరకం అనుభవిస్తోంది.
ఏడాది క్రితం ఈ గొడవంతా వద్దనుకుని ఆ అమ్మాయితో తెగదెంపులు చేసుకోవాలని అనుకున్నారు. ఆ సమయంలోనే ఆ అమ్మాయి జానీ మాస్టర్ కంపెనీపై కన్నేసింది. జానీ మాస్టర్ కంపెనీ ద్వారా సుకుమార్ తీస్తున్న సినిమాలోని ఓ పాటకు ఆ అమ్మాయి కొరియోగ్రాఫర్ అయిపోవాలని అనుకుంది. ఈ విషయం జానీ మాస్టర్‌కు తెలీడంతో ఆయన సుకుమార్ ముందే నువ్వెలా వస్తావ్ అని పెద్ద గొడవ చేసారు. అప్పుడు ఆమె ఛాంబర్‌కి వెళ్లి నాకు పని కావాలి నన్ను ఆపుతున్నారు జానీ మాస్టర్ నరకం చూపిస్తున్నారు అంటూ ఫిర్యాదు చేసింది. అదే సమయంలో ఆ అమ్మాయి జానీ మాస్టర్‌ను పెళ్లి చేసుకోవాలని అతన్ని భార్యాపిల్లల్ని వదిలేయాలని హెచ్చరించింది.
అదే సమయంలో జానీ మాస్టర్ భార్య వెళ్లి ఆ అమ్మాయితో గొడవేసుకుంది. జానీ మాస్టర్ భార్య ఆ అమ్మాయిని కొట్టిందో లేదో నాకు తెలీదు కానీ కొట్టే హక్కు ఆవిడకి ఉంది. పరాయి స్త్రీ భర్తను ఎలా లాక్కోవాలని చూస్తుంది? ఆ అమ్మాయిని మాస్టర్ రిజెక్ట్ చేసారో అప్పుడే ఆయన్ను ఇరికించాలని ఆ అమ్మాయి ప్లాన్ వేసింది. అలా ప్లాన్ ప్రకారం ఒక అడ్వకేట్ వద్దకు వెళ్లి 36 పేజీల సబ్జెక్ట్ రాసి ఫిర్యాదు చేసారు. పోలీసులు విచారణ చేపడుతుండగానే జానీ మాస్టర్‌దే తప్పు అని ప్రెస్ మీట్ పెట్టేసారు. ఇక్కడ యాంకర్ ఝాన్సీ కూడా తెగ ఓవరాక్షన్ చేసారు. ఆ అమ్మాయి తనకు అవకాశాలు రావడం లేదు అని బాధపడింది కాబట్టి అల్లు అర్జున్ తన నిర్మాణ సంస్థ ద్వారా అవకాశాలు ఇప్పిస్తానని అన్నారు. ఇక్కడ అల్లు అర్జున్ తప్పు లేదు. తప్పంతా ఆ భరద్వాజ్, ఝాన్సీలతో పాటు కేసు పెట్టిన అమ్మాయిది. త్వరలో నిజానిజాలు బయటికి వస్తాయి. “” అంటూ సంచలన ఆరోపణలు చేసారు నట్టి కుమార్.