Jani Master: జానీ మాస్ట‌ర్‌కు షాక్‌.. జాతీయ అవార్డు రద్దు

national award cancelled for jani master

Jani Master: అత్యాచార కేసులో శిక్ష అనుభ‌విస్తున్న కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్‌కు షాక్ త‌గిలింది. ఆయ‌న అందుకోవాల్సిన జాతీయ అవార్డును ర‌ద్దైంది. స‌హ కొరియోగ్రాఫ‌ర్‌పై అత్యాచారం చేసిన నేప‌థ్యంలో జానీ మాస్ట‌ర్ వారం రోజుల క్రితం అరెస్ట్ అయ్యారు. ఈ నెల 8న జానీ మాస్ట‌ర్ జాతీయ అవార్డు అందుకోవాల్సి ఉంది. జాతీయ అవార్డును అందుకునేందుకు గానూ ఆయ‌న‌కు కోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసింది. అత్యాచార నిందితుడికి అవార్డు ఎలా ఇస్తారంటూ పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వెల్లువెత్త‌డంతో జాతీయ అవార్డుల‌ క‌మిటీ అవార్డు రద్దు చేసింది. ఇక ఆయ‌న మ‌ధ్యంత‌ర బెయిల్ కూడా ర‌ద్ద‌య్యే అవ‌కాశం ఉంది.