ముసలి నటులు రంగేసుకుని నటిస్తున్నారు!
Mumbai: ముసలి వాళ్లు పెద్దవారిలా కనిపించడానికి జుట్టుకి రంగేసుకుంటున్నారని అన్నారు ప్రముఖ బాలీవుడ్ నటులు నసీరుద్దిన్ షా(naseeruddin shah) . ఇప్పుడు బాలీవుడ్‌లో ఫేమస్ అయిన యంగ్ నటుల గురించి ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసారు. “మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన కుర్రాళ్లు రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవడం చూసి ఒక్కోసారి భయం వేస్తుంటుంది. మనోజ్ బాజ్‌పాయ్, పంకజ్ త్రిపాఠి, నవాజుద్దిన్ సిద్ధిఖి, గుల్షన్ దేవయ్య, గజరాజ్ రావ్.. ఇలా వీరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే.. వీరంతా మిడిల్ క్లాస్ నుంచి వచ్చినవారు. వీరు ఇంత సక్సెస్ ఎందుకయ్యారంటే.. వారిది నిజమైన జీవితాలు. మనం ఎంత ఫేమస్ అయితే అంత పాపులారిటీ, డబ్బు వస్తుంది. దాంతో ఒంటరి అయిపోతాం. జీవితంతో మనకున్న టచ్ పోతుంది. ఇలా ఉంటేనే స్టార్ అవుతాం. ఇప్పుడు వీరంతా ఎలా ఉన్నారంటే.. తెల్లబడిపోయిన జుట్టుకి నల్ల రంగు వేసి.. మళ్లీ పెద్దవారిలా కనిపించడానికి జుట్టుకి వైట్నర్ వేస్తున్నారు” అని కామెంట్ చేసారు.