Nani: ఆ సినిమాకు రాని అవార్డ్.. ఫీలైన నాని

69వ జాతీయ చ‌ల‌న చిత్ర పుర‌స్కారాల్లో (69th national film awards) మ‌న టాలీవుడ్ ఎన్నో అవార్డుల‌ను సొంతం చేసుకుని డామినేట్ చేసేసింది. కానీ తెలుగు ఆడియ‌న్స్ తెలుగు సినిమాల‌తో పాటు త‌మిళ న‌టుడు సూర్య (suriya) న‌టించిన జై భీమ్ (jai bhim) సినిమాకు బెస్ట్ ఫిలిం అవార్డు రావాల‌ని కోరుకున్నారు. అలా కోరుకున్న‌వారిలో నేచుర‌ల్ స్టార్ నాని (nani) కూడా ఉన్నారు. త‌మిళ సినిమాల్లో బెస్ట్ సినిమాగా జై భీమ్ వ‌స్తుంది అనుకుంటే.. అది కాస్తా వేరే సినిమాకు వెళ్లిపోయింది. దాంతో జై భీమ్‌కి రాలేద‌ని హార్ట్ బ్రేక్ అయిన ఎమోజీ పెట్టి నాని (nani) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు.