Nani: “నా కొడుకు ముందే మా ఆవిడని కిస్ చేస్తా”
Nani: నేచురల్ స్టార్ నాని హై నాన్న (hi nanna) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మృణాల్ ఠాకూర్ (mrunal thakur) హీరోయిన్గా నటించారు. టీజర్, ట్రైలర్, ఓడియమ్మ వంటి సాంగ్స్‌తో సినిమా ఓ రేంజ్లో ఉంబోతోందని అర్థమైపోయింది. అయితే ఈ సినిమాలో నాని, మృణాల్ మధ్య కొన్ని లిప్ లాక్ సీన్లు ఉన్నాయి. వీటి గురించి నాని ఓ సందర్భంలో మాట్లాడారు. దేశం జనాభా ఓ మధ్య పెరిగిపోతుంటే ఇంకా సినిమాల్లో లిప్ కిస్ సీన్లను పెద్ద బూతులా చూస్తున్నారని నాని మండిపడ్డారు.
ముద్దు అనే ప్రేమను వ్యక్తపరిచే ప్రక్రియ అని దానిని తప్పుగా చూడకూడదని చెప్పారు. లిప్ కిస్ సీన్లలో ప్రతీ ఒక్క హీరో, హీరోయిన్ చెప్పే మాటలు ఇవే. కానీ నాని ఒక షాకింగ్ మాట కూడా చెప్పారు. ఇంట్లో తన కుమారుడు అర్జున్ ముందే తన భార్య అంజనను ముద్దు పెట్టుకుంటానని.. అది ప్రేమను వ్యక్త పరచడం అని అర్జున్‌కి తెలియాలని అందులో తప్పు లేదని తెలుసుకోవాలని తెలిపారు. నాని మాటల్లో తప్పు లేదు కానీ ఇలాంటివి సినిమాల వరకే బాగుంటాయి. ఈ మధ్యకాలంలో పిల్లలకు ఏది తప్పు అని చెప్తే అదే చేసేస్తున్నారు. ఇక ఈ విషయాలు కూడా వారి ముందు మాట్లాడితే ఇంకా ప్రమాదం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.