Nani30: రిలీజ్ డేట్ లాక్!
Hyderabad: నేచురల్ స్టార్ నాని(Nani) ఇటీవలే ‘దసరా’(Dasara) సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు. శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో తన రా అండ్ రస్టిక్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఏకంగా వంద కోట్ల వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దసరా(Dasara) సక్సెస్ జోష్‌లోనే తన నెక్ట్ మూవీ రిలీజ్ డేట్ కూడా లాక్ చేసినట్టు ప్రకటించారు నాని.
దసరా రిలీజ్‌కి ముందే నాని తన తదుపరి సినిమా షూటింగ్‌ని మొదలు పెట్టారు. నాని కెరీర్లో 30వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను శౌర్యువ్ డైరెక్ట్ చేస్తున్నారు. Nani30 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా పూర్తి ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తండ్రికూతుళ్ల బంధం గురించి చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇక నాని సరసన అందాల భామ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్గా నటిస్తోండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
నాని 30వ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. 21 డిసెంబర్ 2023 రోజున ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.