Nandini Reddy: అందుకే స్టార్​ హీరోలతో సినిమాలు చేయట్లేదు

Hyderabad: అలా మొదలైంది(Ala Modalaindi) సినిమాతో దర్శకురాలిగా తన కెరీర్ మొదలుపెట్టారు డైరెక్టర్​ నందినీ రెడ్డి(Nandini Reddy). మొదటి సినిమానే మంచి విజయం సాధించడంతో వరుస సినిమాలను రూపొందిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. సమంత(Samantha) లీడ్ రోల్‌లో తెరకెక్కించిన ఓ బేబీ(O Baby) సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం నందిని సంతోష్​ శోభన్​(Santhosh Shobhan) హీరోగా అన్నీ మంచి శకునములే(Anni Manchi Sakunamule) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. త్వరలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రమోషన్స్​లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరోల గురించి పలు కామెంట్లు చేశారు.

ప్రస్తుతం నందినీ రెడ్డి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. చిన్న హీరోలతోనే సినిమాలు చేయడానికి కారణం ఏంటనే ప్రశ్నకు.. ‘చిన్న హీరోలతోనే చేయాలి.. పెద్ద హీరోలతో చేయకూడదు అని ఏమీ లేదు. కథ రాసుకునే సమయంలో ఎవరికి బాగుంటుంది అనే ఆలోచనలు వస్తాయి. ఆ హీరోను దృష్టిలో పెట్టుకునే కథ మొత్తం పూర్తవుతుంది. అంతేగానీ, చిన్న హీరోకు రాసే కథలు, స్టార్ హీరోకు రాసుకునే కథలు అనేది ఏమీ ఉండదు’ అంటూ సమాధానమిచ్చారు నందినీ రెడ్డి. ‘పెద్ద హీరోలకు ఉండే మాస్ ఫ్యాన్ బేస్‌ను కూడా మెప్పించేలా సినిమా తెరకెక్కించాలి. సింపుల్ కథలు పెద్ద హీరోలకు సరిపోవు. వాళ్లకి రాయాలి అని ముందుగానే అనుకోవాలి. ఆ ఫ్యామిలీ కథనే ప్రేక్షకులకు వివరించాలి. మంచి పాయింట్ దొరికితే తప్పకుండా పెద్ద హీరోలతో చేస్తాను. పెద్ద హీరోల్లో కూడా నాకు నచ్చిన వాళ్లు ఉన్నారు. వాళ్లకు తగిన కథ అనుకున్నప్పుడు వాళ్లతో కచ్చితంగా సినిమా చేస్తాను’ అంటూ స్టార్​ హీరోలతో సినిమాలు చేయకపోవడానికి గల కారణాలు పంచుకున్నారు.