Project K: ప్ర‌భాస్ ఎంట్రీ డైనోసర్‌లా ఉండ‌బోతోంది

Hyderabad: డైరెక్ట‌ర్ నందిని రెడ్డి(nandini reddy).. ప్రభాస్(prabhas) న‌టించ‌బోయే ప్రాజెక్ట్ కే(project k) గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ప్రాజెక్ట్ కే(project k)ని వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్‌పై తీస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఇదే బ్యాన‌ర్ నుంచి నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన అన్నీ మంచి శ‌కున‌ములే రిలీజ్ అవ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో ప్రాజెక్ట్ కే గురించి కూడా మాట్లాడారు.

“నేను వైజ‌యంతి మూవీస్‌తో సినిమా చేస్తున్న‌ప్పుడు వాళ్ల ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లో ప్రాజెక్ట్ కేకు సంబంధించిన కొన్ని పోస్ట‌ర్లు చూసాను. కానీ ఎప్పుడూ ఆ సినిమా గురించి అడ‌గలేదు. కానీ నాకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. మొన్న ఆదిపురుష్ ట్రైల‌ర్ చూడ‌టానికి స్వ‌ప్న ద‌త్, నేను వెళ్లాం. ఆదిపురుష్‌కే ఆ రెస్పాన్స్ ఉందంటే.. ఇక ప్రాజెక్ట్ కే ఎలా ఉంటుందో అని ఇద్ద‌రం తలుచుకుని న‌వ్వుకున్నాం. ఆ సినిమాకు సంబంధించిన వివ‌రాలు నాకు తెలీదు కానీ ఒక్క‌టి మాత్రం చెప్ప‌గ‌ల‌ను. జురాసిక్ పార్క్ సినిమా చూస్తున్న‌ప్పుడు డైనోస‌ర్ల ఎంట్రీకి మ‌నం ఎంత ఎగ్జైట్ అవుతామో.. థియేట‌ర్‌లో ప్ర‌భాస్ ఎంట్రీ కూడా అలాగే ఉండ‌బోతోంది” అని చెప్పారు నందిని రెడ్డి. స్వ‌ప్న ద‌త్ భ‌ర్త నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే ను డైరెక్ట్ చేస్తున్నారు.