Nagarjuna: అన్యాయంగా నా భవనం కూల్చేసారు
Nagarjuna: సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను (N Convention) హైడ్రా సంస్థ కూల్చేసింది. మాదాపూర్‌లో తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించారని ఆరోపిస్తూ దానిని ఈరోజు కూల్చేసారు. దీనిపై నాగార్జున స్పందించారు. అన్యాయంగా తన భవనాన్ని కూల్చేసారని అన్నారు. ఎన్ కన్వెన్షన్‌ను పట్టా భూమిపై నిర్మించామని.. దానికి ఆ చెరువుకి ఏ సంబంధం లేదని అన్నారు. కావాలనే తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కనీసం కూల్చేస్తున్నామని తనకు నోటీసులు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసారు. కోర్టులో పెండింగ్ ఉన్న ఈ కేసులో తనదే తప్పు అని తీర్పు వస్తే తానంతట తానే ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేయించేవాడినని అన్నారు.