Nagarjuna: అనుష్క‌, చైత‌న్య‌ల‌పై రూమ‌ర్స్.. ఆనాడు నాగ్ రియాక్ష‌న్

సినిమా రంగం అంటేనే రూమ‌ర్స్. కొంద‌రు కావాలంటే వ్యూస్ కోసం క్లిక్స్ కోసం రాసేస్తుంటారు. మ‌రికొంద‌రు వెరిఫై చేసుకుని మ‌రీ రాస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఈ రూమ‌ర్లు సెల‌బ్రిటీల‌ను ఎంతో బాధిస్తుంటారు. వారు ఎంతో కంగారు ప‌డిపోతుంటారు. ఇలాంటి ఘ‌ట‌నే అక్కినేని నాగార్జునకు (nagarjuna) జ‌రిగింది. అప్పుడే నాగ‌చైత‌న్య (naga chaitanya) జోష్ (josh) సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ స‌మ‌యంలో నాగ‌చ‌చైత‌న్య షూటింగ్ కోస‌మని స్విట్జ‌ర్లాండ్ వెళ్లాడు. స‌రిగ్గా అప్పుడే నాగ చైత‌న్య‌, అనుష్క (anushka) ఎంగేజ్‌మెంట్ చేసుకున్న‌ట్లు రూమ‌ర్స్ వ‌చ్చాయ‌ట‌. వెంట‌నే నాగార్జున‌.. చైకి కాల్ చేసి నాకు చెప్ప‌కుండా చేసుకున్నావా? అని అడిగాడ‌ట‌. అది విని నాగ‌చైత‌న్య ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని ఓసారి నాగార్జున ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. సినిమా రంగంలో నిల‌బ‌డ‌లాంటే ఇలాంటి రూమ‌ర్స్‌ని కూడా త‌ట్టుకోవాల‌ని నాగ‌చైత‌న్య‌కు చెప్పాన‌ని.. అప్ప‌టినుంచి ఎన్ని ర‌కాల రూమ‌ర్స్ వ‌చ్చినా ప‌ట్టించుకోవ‌డం మానేసామ‌ని వెల్ల‌డించారు నాగ్. (nagarjuna)