Nagarjuna @100..మెగాస్టార్‌తో ఢీ..!

Nagarjuna: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున 100వ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ సారి ఆయ‌న ల‌వ్, యాక్ష‌న్, రొమాన్స్ ఉన్న సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాను త‌మిళ ద‌ర్శ‌కుడు జ్ఞాన‌వేల్ రాజా (gnanavel raja) డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని చూస్తున్నారు.

ఇక్క‌డ మ‌రో స‌ర్‌ప్రైజింగ్ అంశం ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) న‌టిస్తున్న విశ్వంభ‌ర (vishwanbara) సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ కానుంది. సో.. నాగ్ 100వ సినిమా చిరు 156వ సినిమాతో బాక్సాఫీస్ దగ్గ‌ర ఢీకొన‌బోతోంద‌న్న‌మాట‌..! నాగ్ న‌టించిన నా సామి రంగా (naa saami ranga) సినిమా కూడా మొన్న సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. మ‌ల‌యాళ రీమేక్ అయిన‌ప్ప‌టికీ మంచి టాక్ అందుకుంది. త‌న 100వ సినిమాతో పాటు త‌మిళ న‌టుడు ధ‌నుష్ న‌టిస్తున్న 51వ సినిమాలో కూడా నాగ్ కీ రోల్ ప్లే చేస్తున్నారు.