చై సామ్ విడాకులు.. తగ్గిన నాగార్జున ఆస్తి
Nagarjuna: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఆస్తి బాగా తగ్గిందట. ఇందుకు కారణం నాగచైతన్య, సమంత విడాకులేనట. నాగచైతన్య, సమంత ఎప్పుడైతే విడాకులు తీసుకున్నారో అప్పుడే నాగార్జున ఆస్తిలోని రూ.100 కోట్లు తగ్గిపోయాయని ఓ ఫైనాన్షియల్ రిపోర్ట్ వెల్లడించింది. 2017లో సమంత అక్కినేని నాగార్జున ఇంటికి కోడలిగా వెళ్లినప్పుడు వారి ఆస్తి విలువ పెరిగిందని.. కానీ వారు విడిపోయాక అది తగ్గిపోయిందని వెల్లడించింది.
అయినప్పటికీ ఇప్పుడు అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ల ఆస్తి విలువ అంతా కలిపి సుమారు రూ. 3654 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ మొత్తం ఆస్తిలో రూ.3000 కోట్లు నాగార్జునవే. మిగతాది నాగచైతన్య, అఖిల్‌కి చెందినవి. ఆయన ఆస్తి వృద్ధి చెందడానికి సగం ఆయన చేసిన సినిమాలు, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వస్తున్న ఇన్‌కం అయితే.. మిగతాదంతా ఆయన హైదరాబాద్, ముంబైలో కొన్న స్థిరాస్తులకు చెందినవి. జూబ్లీహిల్స్‌లో ప్రస్తుతం నాగార్జున ఉంటున్న ఇంటి విలువే రూ.50 కోట్ల వరకు ఉంటుందట.