N Convention: నాగార్జునకు తెలంగాణ హైకోర్టులో ఊరట
అక్కినేని నాగార్జునకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మాదాపూర్‌లోని తుమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్‌ని అక్రమంగా నిర్మించారంటూ ఈరోజు హైడ్రా సంస్థ ఆ భవనాన్ని పడగొట్టింది. దీనిపై నాగార్జున స్పందిస్తూ.. దానిని అక్రమంగా నిర్మించలేదని.. కనీసం పడగొడుతున్నట్లు తనకు నోటీసులు కూడా ఇవ్వలేదని.. ఈ కేసు కోర్టులో నడుస్తుండగా ఎలా పడగొడతారంటూ ఆయన హైకోర్టుకెక్కారు. వాదోపవాదాలు విన్న కోర్టు కూల్చివేతను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.