Nagarjuna: సారీ.. ఇలా జ‌రిగింద‌ని ఇప్పుడే తెలిసింది

Nagarjuna apologises to a man who was dragged by his bodyguard

Nagarjuna: న‌టుడు అక్కినేని నాగార్జున ట్విట‌ర్ వేదిక‌గా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. నిన్న ఆయ‌న ఎయిర్‌పోర్ట్ నుంచి వ‌స్తున్న స‌మ‌యంలో ఓ అభిమాని ఆయ‌నకు ద‌గ్గ‌ర‌గా వెళ్లి సెల్ఫీ తీసుకోవాల‌నుకున్నాడు. అది చూసి ప‌క్క‌నే ఉన్న బాడీగార్డ్ ఆ వ్య‌క్తిని ప‌క్క‌కు లాగేసాడు. అది రికార్డ్ అవ‌డంతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నాగార్జున స్పందిస్తూ.. అలా జ‌రిగిన‌ట్లు త‌న‌కు ఇప్పుడే తెలిసింద‌ని.. బాడీగార్డ్ త‌ర‌ఫున ఆ వ్య‌క్తికి తాను క్ష‌మాప‌ణ‌లు చెప్తున్నాన‌ని అన్నారు. ఈ ఘ‌ట‌న‌పై విచారించి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని వెల్ల‌డించారు.