కొండా సురేఖపై నాగార్జున వంద కోట్ల పరువు నష్టం దావా
Nagarjuna: తన కొడుకు నాగాచైతన్యపై.. మాజీ కోడలు సమంత విడాకులపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖపై అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేసారు. దాదాపు రూ.100 కోట్ల మేర దావా వేసారు. ఆల్రెడీ సురేఖకు నిన్న నోటీసులు పంపించారు. ఈ కేసును మనోరంజన్ కోర్టు పరిశీలించి వాయిదా వేసింది. నోటీసులతో పాటు పరువు నష్టం దావా కూడా వేయాలని నాగార్జున నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో తన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయడంతో ఆ నష్టాన్ని ఈ దావా రూపంలో తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.