Naga Shaurya: తల్లిదండ్రులతో విభేదాలు..కొత్త బ్యానర్?
యువ నటుడు నాగశౌర్యకు (naga shaurya) తన తల్లిదండ్రులతో విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సొంత ప్రొడక్షన్ బ్యానర్‌తో శౌర్యను టాలీవుడ్‌కు పరిచయం చేసింది అతని తల్లిదండ్రులే. కానీ ఇప్పుడు శౌర్య వారి నుంచి వేరే కాపురం పెట్టాలని.. తానే సొంతంగా మరో బ్యానర్ ఓపెన్ చేయాలనుకుంటున్నాడని టాలీవుడ్ వర్గాల సమాచారం. నాగశౌర్యకు స్క్రిప్ట్‌లు సెలెక్ట్ చేసేది వాళ్ల నాన్న, అంకుల్ అట. ఈ మధ్యకాలంలో శౌర్యకు మంచి హిట్ పడింది లేదు. దాంతో శౌర్య చాలా డిస్టర్బ్ అయ్యాడట. ఇందుకు కారణం వాళ్ల నాన్న సెలెక్ట్ చేసిన స్క్రిప్ట్‌లే అని అందుకే ఇక నుంచి తన సినిమాలు తానే సెలెక్ట్ చేసుకుని ప్రొడ్యూస్ చేసుకుంటానని శౌర్య తన తల్లిదండ్రులతో అన్నాడట. అలా శౌర్యకు తల్లితండ్రుల మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. (naga shaurya)