Naga Shaurya: నా మ‌ద్ద‌తు ద‌ర్శ‌న్‌కే.. నాగశౌర్య షాకింగ్ పోస్ట్

Naga Shaurya says he stands with darshan

Naga Shaurya: ప్ర‌ముఖ న‌టుడు నాగ‌శౌర్య‌.. అభిమాని మ‌ర్డ‌ర్ కేసులో అరెస్ట్ అయిన క‌న్న‌డ న‌టుడు ద‌ర్శ‌న్‌కు మ‌ద్ద‌తు తెలిపారు. ఈ మేర‌కు తానెందుకు ద‌ర్శ‌న్‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నాడో వివ‌రిస్తూ ఓ పోస్ట్ పెట్టారు.

“” మృతుడు రేణుకా స్వామి కుటుంబీకులకు ఈ బాధ‌ను తట్టుకునే శ‌క్తిని ప్ర‌సాదించాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నాను. అయితే ఈ విష‌యంలో అస‌లు ఏం జ‌రిగిందో తెలుసుకోకుండా ఓ నిర్ణ‌యానికి రావ‌డం చాలా బాధాక‌రం. ద‌ర్శ‌న్ అన్న గురించి నాకు తెలుసు. ఆయ‌న క‌ల‌లో ఎవ‌రికీ ఏ హాని త‌ల‌పెట్ట‌డు. ఆయ‌నంటే ఏంటో తెలిసిన‌వారికే ఈ విష‌యం అర్థ‌మ‌వుతుంది. అవ‌స‌రంలో ఉన్న చాలా మందికి తోడుగా నిలిచి సాయం చేసిన వ్య‌క్తి ద‌ర్శ‌న్ అన్న‌. కానీ ఈ వార్త‌ను మాత్రం నేను జీర్ణించుకోలేక‌పోతున్నాను. న్యాయ వ్య‌వ‌స్థ ప‌ట్ల నాకు న‌మ్మకం ఉంది. త్వ‌ర‌లో నిజం బ‌య‌టికి వ‌స్తుంది. ఈ కేసు నుంచి ద‌ర్శ‌న్ అన్న నిర్దోషిగా బ‌య‌టికి వ‌స్తాడ‌ని అస‌లైన నేర‌స్తుడికి శిక్ష ప‌డుతుంద‌ని బ‌లంగా కోరుకుంటున్నాను “””” అని తెలిపారు.

ద‌ర్శ‌న్ విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు ఏ న‌టి కానీ న‌టుడు కానీ ఇంత పాజిటివ్‌గా స్పందించింది లేదు. పైగా మృతుడు రేణుకా స్వామి ఫోటోలు బ‌య‌టికి రావ‌డంతో స్వ‌యంగా ద‌ర్శ‌న్ అభిమానులే ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్నారు. ఎంతో దారుణంగా రేణుకా స్వామి అనే వ్య‌క్తిని ద‌ర్శ‌న్ చంపేసారంటూ మండిప‌డుతున్నారు.